Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బుల కోసం రోడ్డుపై ఆందోళనకు దిగిన ప్రజలు... కిలో మీటరు మేర ట్రాఫిక్ జాం

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొని 25 రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు అంద‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో సామాన్యులు స‌హ‌నం కోల్పోతున్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో న‌గదు కోసం ప్రజలు రోడ్డెక్కారు. ఆ ప్రాంతంలోని ఎస్‌బీఐ శాఖ‌లో త‌మ‌కు న‌గ‌దు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌జలంతా క‌లిసి కర్నూలు-గుంటూరు రహదారిపై ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌తో ఆ ప్రాంతంలో కిలోమీటరు మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. నిత్యావ‌స‌ర స‌రుకులు కూడా కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ‌ని చెబుతున్నారు.

More Telugu News